తెలంగాణ

అందుబాటులోకి ఎం-వ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఎం-వ్యాలెట్‌ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి బుక్, వాహన బీమా వంటి పత్రాలను ఇక నిరంతరం వాహనంతో పాటు వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు ఎం-వ్యాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని వాహన సర్ట్ఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 84లక్షల వాహనాలు ఉన్నాయి.
ఎం-వ్యాలెట్‌తో కోటి 44లక్షల మంది వాహన దారులకు ఉపయోగపడుతుంది. ఈ వ్యాలెట్‌ను ఉపయోగించి 60 లక్షల మంది తమ డ్రైవింగ్ లైసెన్స్‌లను ఇక్కడ చూపించవచ్చు. విదేశాల్లో ఇలాంటి విధానం అమలులో ఉంది. దీని వల్ల వాహనానికి సంబంధించి, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి పోయినా సమస్య ఉండదు. మారుతున్న పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటామని, ఐటి సేవలు ఉపయోగించుకుని రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఐటి మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రమాదాల నివారణకు , జాప్యం, అవినీతి నివారణ, ప్రజలకు రవాణా సేవలను మరింతగా ఉపయోగపడే విధంగా ఐటిని రవాణా శాఖ ఉపయోగించుకుంటుందని తెలిపారు. బడ్జెట్‌లో రవాణా శాఖకు 80 కోట్లు కేటాయించామని, అన్ని ఆర్‌టిఏ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. సిరిసిల్లలో నిరుద్యోగ యువత కోసం 18 కోట్లతో డ్రైవింగ్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాద రహిత తెలంగాణ కోసం రవాణా శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఐటి సేవలను ఉపయోగించుకోవడంతో ప్రపంచంలో తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక గుర్తింపు పొందుతుందని తెలిపారు.

బుధవారం సచివాలయంలో ఎం-వ్యాలెట్‌ను ప్రారంభిస్తున్న తెలంగాణ మంత్రులు కెటిఆర్, పి.మహేందర్‌రెడ్డి