తెలంగాణ

ప్రైవేట్‌ను కట్టడి చేస్తేనే విద్య ప్రక్షాళన సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ప్రైవేట్ విద్యను కట్టడి చేయకుండా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదని శాసనసభలో పాలక, ప్రతిపక్ష సభ్యులు ముక్తకంఠంగా తేల్చి చెప్పారు. విద్యావ్యవస్థను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది పాలకపక్ష సభ్యులు విమర్శించగా, తాము చేయాలేని పనిని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మీరు ఎందుకు చేయలేదని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. విద్యరంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై శాసనసభలో బుధవారం ప్రత్యేక చర్చ జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ విధానంపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సభలో సమర్పించిన పత్రంపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిజెపి సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా వాటిలో అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం 32 స్థానంలో ఉండటం ఆందోళనకరమైన అంశమన్నారు. రాష్ట్రంలో 29,966 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 11,470 పాఠశాలలు కలిగి ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య 31 లక్షలు ఉండటం ఆందోళనకరమైన అంశమని లక్ష్మణ్ అన్నారు. టిడిపి సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆంగ్లంలో బోధన జరగడం వల్లనే విద్యార్థుల తల్లిదండ్రులు అటువైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇంకా ఈ చర్చలో కాంగ్రెస్ సభ్యుడు ఎస్‌ఎ సంపత్‌కుమార్, టిఆర్‌ఎస్ సభ్యుడు మనోహర్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు పాషా ఖాద్రీ తదితరులు పాల్గొని, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను ఎండగట్టారు.

పశువులనూ మేసేశారు!
బయటపెట్టిన కాగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రైతులు, స్వయం సహాయక బృందాలకు ఆదాయం సమకూర్చడానికి పశువులు కొనిచ్చే పథకంలోనూ మేసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ వ్యవహారం కాగ్ పరిశీలనలో బహిర్గతం అయింది. లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో బర్రెల వయసు 60 నెలల కన్నా తక్కువ ఉండాలి, ఆవుల వయసు 48 నెలలు మించరాదు. ఈ వయసులో ఉన్నవి అయితేనే ఇవి దీర్ఘకాలం పాలు బాగా ఇస్తాయని ఈ నిబంధన విధించారు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో మూడు జిల్లాల్లో 255 బర్రెలను తనిఖీ చేస్తే వీటిలో 105 బర్రెలు, ఆవులు వయసు మీరి ఉన్నట్టు తేలింది. నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో దాదాపు సగం బర్రెలు, ఆవులు వయసు మీరినవే. లబ్ధిదారులే వయసు మీరిన వాటిని కావాలని కోరుకున్నారని కొందరు పశు సంవర్థక శాఖ అధికారులు అతి తెలివిగా సమాధానం ఇచ్చారు. కానీ మార్గదర్శకాలు నిర్దిష్టంగా ఉన్నందున వారు చెప్పిన సాకు ఆమోద యోగ్యంగా లేదని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. ఇక పశువులు రవాణాకు సైతం మార్గదర్శకాలు ఉండగా, అతి దూరం నుంచి కొనుగోలు చేసి తరలించినట్టుగా అత్యధిక ప్రయాణ ఖర్చులు వసూలు చేసినట్టు కాగ్ బయటపెట్టింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి రసీదులు లేవు.ఒక పశువు వల్ల ఆర్థికంగా గిట్టుబాటు కాదని, రెండు పశువులను అందజేయాలని పాడి పశువుల సరఫరా పథకం నిబంధనలు ఉండగా, దాన్నీ పాటించలేదు. 2010-14 మధ్య కాలంలో మూడు జిల్లాల్లో 7125 పశువులకు 250 రోజులకు 3562 టన్నుల దాణాను అందించగా, 1544 టన్నుల దాణా సరఫరా జరగలేదు. తగినంత దాణా సరఫరా చేయకపోవడం వల్ల ఆశించిన పాల దిగుబడి జరగలేదని కాగ్ నివేదికలో పేర్కొన్నారు.