తెలంగాణ

ఉపాధి హామీలో తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు తెలంగాణ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కించుకుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. యువతకు ఉపాధి శిక్షణ, అవకాశాలు కల్పించడంలో విశేషకృషి చేసినందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డును తెలంగాణ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంయం) కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్-నేషనల్ రూరల్ లైలీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్వో-ఎన్‌ఆర్‌ఎల్‌యం) ఉత్తమ అవార్డును తెలంగాణ సెర్ప్ సొంతం చేసుకుంది.
ఈ అవార్డులను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు అందుకున్నారు. ఉపాధి హామీకి సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వరంగల్ జిల్లా (గ్రామీణ)కు లభించిన అవార్డును కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అందుకున్నారు.
ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి అందుకున్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించినందుకు నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి బ్రాంచ్ పోస్ట్ఫాస్‌కు లభించగా, ఆ అవార్డును పోస్ట్ మాస్టర్ అబ్దుల్ సత్తార్ అందుకున్నారు.

చిత్రం.. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి ఉపాధి హామీ జాతీయ అవార్డులను అందుకుంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్,