తెలంగాణ

నెంబర్‌వన్‌గా తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే అభివృద్ధి దిశగా వేసుకుంటున్న పునాదుల దశలోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, అయినా తాము పొంగిపోమని, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌వన్ స్థానంలో నిలబెట్టే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ఎంతో ముందుచూపుతో, ఆర్థిక నిపుణులను సంప్రదించి బడ్జెట్‌ను రూపకల్పన చేశామని తెలిపారు.
ప్రజలు మెచ్చిన, ప్రజలకు నచ్చిన ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు. తమ పరిపాలనలో ఎలాంటి పైరవీలకు తావుండబోదని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రానికి జాతీయ, బహుళ జాతీ, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రవేశపెట్టిన తెలంగాణ ఈపాస్ విధానానికి నేడు చక్కటి స్పందన వచ్చి, పెట్టుబడుల తాకిడి నెలకొందన్నారు. ఈ పాస్ విధానంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం మనం ప్రతిపాదించుకున్న డబుల్ బెడ్ రూం వంటి స్కీంలకు హడ్కో రుణం తీసుకోవాలని భావిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే ముందుకెళ్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్టికల్ 292, 293 ప్రకారం జిఎస్‌డిపి కింద రుణాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మిషన్ భగీరధ కార్యక్రమాన్ని పకడ్బందీగా, విజయంతం చేసేందుకు గాను హడ్కోనుంచి రుణం కోసం అవగాహనవంతమైన ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రాణ ప్రదాయామైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రైతులకు అనేక రకాలుగా సబ్సిడీ ఇచ్చేందుకు గాను బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించటం జరిగిందన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేయటం వల్లే ఏసిడిపి నిధులను రూ. 3 కోట్లకు పెంచామని వివరించారు. అంతేగాక, ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహారించే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కూడా నేటి అవసరాలు, నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని జీతాలను పెంచామన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలుండవచ్చునని, తాము చేపట్టిన చర్యలతో మరో నాలుగు నెలల్లో ఆసుపత్రి రూపురేఖలు మారుస్తామన్నారు. రానున్న మూడేళ్లలో 2లక్షల 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేస్తామని బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం తీసుకోనున్నట్లు మంత్రి

అందరికీ మంచి నీరు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్
జలమండలి వద్ద బుధవారం కుండలతో ప్రదర్శన నిర్వహిస్తున్న
సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి తదితరులు