తెలంగాణ

నేడు అసెంబ్లీలో కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ శాసన సభ గురువారం ఒక రికార్డును సృష్టించనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇదే మొదటి సారి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తెలంగాణకు అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్టులపై సవివరంగా వివరిస్తాను అని ముఖ్యమంత్రి ముందుకు రాగా, విపక్షాలు నిరాకరించడం ఇదో విశేషం. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం పై నిబంధనలు ఏమీ లేవు. నిబంధనలు రూపొందించిన కాలానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనే విధానమే లేకపోవడం వల్ల దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిజానికి గత శాసన సభా సమావేశాల్లోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ నాయకులు అంగీకరించలేదు. ఈసారి ఎలాగైనా ప్రాజెక్టుల గురించి వివరించి తీరాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. స్పీకర్ అనుమతి ముందే తీసుకున్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సంపూర్ణమైన అవగాహనతో ఉండగా, కాంగ్రెస్ మాత్రం ఈ అంశంలో బలహీనంగా ఉంది. మీ పార్టీ తరఫున నిపుణులను పిలిపించుకోండి, నేను చెప్పిన అంశాలను పెన్‌డ్రైవ్ కూడా ఇస్తాను అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోలేదు. సభకు హాజరు కావద్దని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరైతే ఒక రకమైన ఇబ్బంది, హాజరు కాకపోవడం మరో రకమైన ఇబ్బంది. సభలో ఉండక పోయినా కాంగ్రెస్ సభ్యులు సిఎల్‌పి కార్యాలయంలో కూర్చోని ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వీక్షించనున్నారు.
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా, ఈ నదుల కింద ప్రాజెక్టులు, వాటి పరిస్థితిని ముఖ్యమంత్రి వివరిస్తారు. మహారాష్ట్ర, కర్నాటక ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిర్మించినందున తెలంగాణ పరిస్థితి ఏమిటో వివరిస్తారు. కృష్ణా నదిపై పెద్దగా ఆశలు పెట్టుకునే అవకాశాలు లేవని, ఇక మిగిలింది గోదావరి మాత్రమేనని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఇదే అంశాన్ని వివరిస్తారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవసరం ఎందుకు? వీటి వల్ల ప్రయోజనం ఏమిటో వివరిస్తారు. విపక్షాలు ఏ అంశంపై అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, నిపుణుల సహకారం తీసుకుని ప్రశ్నించవచ్చునని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి మూడు గంటల పాటు ప్రాజెక్టుల గురించి చెబుతుంటే మేం కూర్చోని వినడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయి అనే భావనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రాజెక్టులపై వివరించే సమయంలో సభలో ఉండకుండా సిఎల్‌పిలో కూర్చోని వినడం కూడా ఇబ్బంది కరమే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహనతో ఉన్న కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత మరింత లోతుగా ఈ అంశంపై దృష్టిసారించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక చారిత్రక ఉపన్యాసంగా మిగిలిపోయే విధంగా వివరించేందుకు ముఖ్యమంత్రి కసరత్తు సాగించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి ముఖ్యమంత్రి గతంలో కొద్ది మందికి సంక్షిప్తంగా వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూసిన వారంతా నీటిపారుదల రంగంలో ముఖ్యమంత్రికి ఉన్న పరిజ్ఞానాకి విస్తుపోయారు.
రైతు రుణ విముక్తి బిల్లు ప్రతిపాదన
అసెంబ్లీలో రైతు రుణ విముక్తి బిల్లు (చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ వృత్తికారులు)ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహ్మద్ మహమూద్ అలీ ప్రతిపాదించారు.