తెలంగాణ

తక్షణ సహాయం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఇంటింటికి మంచినీరు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ భగీరథ వంటి పథకాలు మంచివేనని తామేమీ వ్యతిరేకించడం లేదని, కానీ గ్రామాల్లో కరువు పరిస్థితి దయనీయంగా ఉందని, తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. బుధవారం శాసన సభలో కరవుపై జరిగిన చర్చలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందని, అనంతపురం తరువాత నల్లగొండలోనే బత్తాయి తోటలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నీళ్లు లేక ఎండిపోతున్నాయని, రైతులు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి ట్యాంకుల్లో నీళ్లు కొనుక్కొని వెళుతూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కరవుకు ప్రభుత్వం బాధ్యత అని తాను అనడం లేదని, వర్షాలు పడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది, కానీ సహాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గ్రామాల్లో తాగునీరు కూడా లేదని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రణాళికలను మేమేమీ వ్యతిరేకించడం లేదు, కానీ తక్షణ సహాయం చేయాలని కోరారు.రెండేళ్ల నుంచి రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తోందని, సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని సిపిఐ సభ్యులు రవీంద్ర కుమార్ విమర్శించారు. తాగునీళ్లు లేక అడవి జంతువులు పులులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయని తెలిపారు.
సహాయ చర్యల కోసం మూడువేల కోట్ల కేటాయించాలని కోరారు. గత దశాబ్ద కాలం నుంచి 300 నుంచి 400 మండలాల్లో కరవు విలయ తాండవం చేస్తోందని, పాలకులు అవలంభించిన విధానాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఆశోకుడు చెట్లు నాటించాడు, కాకతీయ రెడ్డి రాజులు చెరువులు తవ్వించారు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు కెసిఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చేపట్టాలని భవిష్యత్తు తరాలు చరిత్రను చెప్పుకుంటాయని అన్నారు. 15ఏళ్ల ఉద్యమంలో తెలంగాణ కన్నీటి కథ తెలుసు కాబట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ, మిషన్ కాతీయ, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని అన్నారు.