తెలంగాణ

నీళ్లు, నిధులు.. ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, జూన్ 23: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలకులపై నిరంతరం పోరాడుతామని జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. అమరుల స్ఫూర్తి యాత్ర శుక్రవారం కౌడిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించాం కాని నేటి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మూలంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అధికారం కొందరి చేతుల్లోనే కొనసాగుతోందని, పాలకులు వ్యక్తిగత లాభా ల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉద్య మ సమయంలో కెసిఆర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, వాటిని నమ్మి ఆయనకు సాయం చేశామన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నియామకాలు, నిధులన్నీ మనకే దక్కుతాయని అందరూ భావించామన్నా రు. తీరా కెసిఆర్ గెలిచాక, కేవలం ఫాం హౌస్, ప్రగతిభవన్‌కే పరితమయ్యారని విమర్శించారు. ప్రజలను, రైతులను, ఉద్యోగులను, ఇతర మేధావులను ఆఖరికి తమలాంటి జెఎసి నేతలను సైతం కలిసేందుకు ఆయనకు సమయం లేకపోవడం దారుణమన్నారు. తెలంగాణ సిద్ధించినా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి లేక అల్లాడుతున్నారని వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ వచ్చాక రైతులకు పూర్తి న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నేరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఎడాదికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడిచినా డీఎస్సీ నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగ యువకులు, జెఎసి నాయకులు, అధికారంలోకి వచ్చాక పనికిరాకుండా పోయారా అని కెసిఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ ఇప్పుడు దాని ఉసే ఎత్తడం లేదన్నారు. సింగూరు నుండి నర్సాపూర్ నియోజకవర్గం రైతుల కు సాగునీరు అందించాలని కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌడిపల్లి లో గిరిజన తండాలు చాలా ఉన్నాయని తరతరాలుగా అటవీభూముల ను సాగుచేస్తున్న గిరిజనుల నుండి ప్రభుత్వం భూములను గుంజుకోవడం పట్ల కోదండరాం విచారాన్ని వ్యక్తం చేశారు. గిరిజనులకు భూములు దక్కేలా జెఎసి నాయకు లు ఉన్నతాధికారుల దృష్టికి తీసకెళ్తారని, వారికి న్యాయం జరిగే వరకు పోరా టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని శేరితండాలో కోదండ రాం శుక్రవారం పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలా గే కౌడిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోదండరాం బృందం సందర్శించి, విద్యార్థుల సమస్యలను తెలుసుకుంది.

చిత్రం.. కౌడిపల్లిలో మాట్లాడుతున్న ఆచార్య కోదండరాం