తెలంగాణ

గొర్రెల పంపిణీలో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: దేశంలోనే వినూత్నమైన విధానంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ తీరుతెన్నులపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు గొల్ల, కుర్మల జీవనప్రమాణాలను మెరుగుపరచేందుకు గొర్రెల పెంపకం ఉపయోగపడుతుందన్నారు. గొర్రెల పంపిణీలో ఏవైనా సమస్యలు ఉద్భవిస్తే, అధికారులు తమస్థాయిలో పరిష్కరించగలిగితే పరిష్కరించాలని, లేని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో కొనసాగుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొంటున్నారని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. కార్యక్రమాన్ని సిఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నందువల్ల యంత్రాంగమంతా చాలా జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు.