తెలంగాణ

గిరిజనులకు 9శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: గిరిజనుల రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న ఆరు శాతం నుంచి తొమ్మిది శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు వారాల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో మైనారిటీలకు నాలుగు నుంచి 12శాతానికి పెంచుతూ, గిరిజనులకు ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మైనారిటీలకు 12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ తెలంగాణ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ ఆసెంబ్లీ ఆమోదించి ఏప్రిల్ 16, 2017న కేంద్రానికి పంపింది. అధికారంలోకి వస్తే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ ఉద్యమ కాలం నుంచి చెబుతూ వచ్చింది. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై ఒకేసారి అసెంబ్లీలో తీర్మానం చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీ రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. ఈ రెండింటికి లింక్ పెట్టడం కన్నా ముందు ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రాలకే ఉంది. మైనారిటీ రిజర్వేషన్ల అంశం మాత్రం కేంద్రం పరిధిలో ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు అంశాలపై ఒకసారి తీర్మానం చేశారు. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం గిరిజనులకు ఆరుశాతం రిజర్వేషన్లు కల్పించారు. విభజన తరువాత తెలంగాణలో గిరిజనుల శాతం పెరిగింది. దీనితో పాటు బోయ, కాయతి లంబాడాలను కూడా గిరిజనుల్లో కలిపితే వారి జనాభా పనె్నండు శాతం అవుతుందని పనె్నండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తొలుత భావించి, ఎన్నికల ప్రణాళికలో 12శాతం హామీ ఇచ్చారు. జనాభా శాతం ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉన్నా కొత్త కులాలను కలిపే అధికారం కేంద్రానిదే. కొత్త కులాలను కలుపుతూ నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పడుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత జనాభా ప్రకారం తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారు. అవన్నీ గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మండలాలు. ఈ మండలాలు ఆంధ్రలో కలవడంతో తెలంగాణలో గిరిజనుల జనాభా తొమ్మిది శాతంగా తేలింది.
మైనారిటీ రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా ఉందని, ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని టిఆర్‌ఎస్ నాయకత్వం మొదటి నుంచి చెబుతూ ఉన్నా కేంద్రంలో మాత్రం అలాంటి కదలిక ఏమీ లేదు. మతపరమైన రిజర్వేషన్లు దేశానికి మంచిది కాదని బిజెపి నాయకులు ఆందోళన చేశారు. మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఒకేసారి నిర్ణయం సాధ్యం కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను తొమ్మిది శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వివిధ గిరిజన సంఘాల నాయకులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ను కలిసి రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వారికి మంత్రులు చెప్పారు.