తెలంగాణ

ఎయిర్ పోర్టుకు ఉగ్ర ముప్పు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని, ఎయిర్‌పోర్టు భద్రతకు ముప్పు వాటిల్లనుందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ టోలిచౌక్‌లో పట్టుబడిన ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌ను విచారించగా ఐసిస్ ఉగ్రవాదుల టార్గెట్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఉన్నట్టు తేలిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. విమానాశ్రయంపై ఉగ్రమూకలు ఎప్పుడైనా దాడికి పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. శంషాబాద్‌లోని ఈ విమానాశ్రయం రన్ వే చుట్టూ ప్రహరీ నిర్మించాలని సైబరాబాద్ పోలీసులు ఎయిర్‌పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఎయిర్‌పోర్టుకు ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్‌స వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రన్‌వే భద్రతపై పోలీసులు దృష్టిసారించారు. ఇటీవల జరిగిన ఎయిర్‌పోర్టు హైలెవల్ సెక్యూరిటీ సమావేశంలో రన్‌వే చుట్టూ ప్రహరీ నిర్మించే అంశంపై ప్రస్తావించినట్టు తెలిసింది.
బయటి నుంచి చూస్తే రన్‌వే మొత్తం కనిపిస్తోందని, ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రన్‌వే కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సమావేశంలో సైబరాబాద్ పోలీసులు విమానాశ్రయ యాజమాన్యాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. దీనిపై విమానాశ్రయ అధికారులు సానుకూలంగా స్పందించారు. రన్‌వే కనిపించకుండా ప్రహరీ, సీసీటివిల ఏర్పాటు చేస్తామని అంగీకారానికి వచ్చినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదిలావుండగా ఎయిర్‌పోర్టు విస్తరణకు భూమి కేటాయించామని జిల్లా అధికారులు సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఎయిర్‌పోర్టు విస్తరణతో భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించినట్టు సమాచారం.