తెలంగాణ

టిసిఎస్‌తో జెఎన్‌టియు ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: జెఎన్‌టియు హైదరాబాద్‌లో చదువుకున్న విద్యార్ధులకు ఉన్నత విద్యకు, పరిశోధనలకు, ఉపాధికి, ప్రాజెక్టుల ప్రోత్సాహానికి తోడ్పడేలా టిసిఎస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టిసిఎస్ వైస్ ప్రెసిడెంట్ , జెఎన్‌టియు విసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇటు యూనివర్శిటీకి, అటు టిసిఎస్ సంస్థకూ మేలు జరిగేలా ఈ అవగాహన ఒప్పందం ఉంటుందని రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, ప్రొఫెసర్ ఎ గోవర్థన్, అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి ఎన్ భండారి, టిసిఎస్ అధికారి జె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు, టీచర్లకు నైపుణ్యాలు, కౌశలాల్లో శిక్షణ, ప్రోత్సాహం ఉంటాయి. అలాగే అధ్యాపకులకు బోధనానుభవాలను పెంచుతారు. టిసిఎస్ పనిలోపనిగా రీసెర్చి ప్రాజెక్టులను కూడా ఇవ్వనుంది.