తెలంగాణ

ఎవరికెంత భూమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: చెరువులు, ప్రాజెక్టుల కింద ఏయే కులాల వారికి ఎంత భూమి ఉంది?, నీటి పారుదల సౌకర్యాల ద్వారా ఏయే కులాలు ఏ మేరకు లబ్ది పొందుతున్నారో గణాంకాలు అందజేయాలని రాష్ట్ర బిసి కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్, సభ్య కార్యదర్శి జిడి అరుణ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. బిసి-ఎ గ్రూపు ప్రజలకు ప్రాజెక్టుల వల్ల ఏమైనా లాభం కలిగిందా?, భూమి లేని పేదలకు నీటి పారుదల సౌకర్యాల వల్ల అందిన ప్రయోజనం ఏమిటీ? అని వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వర్షం నీటిని ఎక్కడికక్కడ నిలుపుకుంటే నదుల్లోకి నీరు చేరే అవసరం రాదని, బంగారు తెలంగాణ సాకారానికి ఈ నీటిని ఎక్కడికక్కడ నిలుపుకోవడం అవసరం అని వారు అభిప్రాయపడ్డారు. అప్పుడే అడవులు, భూగర్భ జలాలు, చేపలు సహజ వనరులు అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రీసెర్చ్-రీసెటిల్‌మెంట్, నీటి పారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.