తెలంగాణ

ముందస్తు అడ్మిషన్లు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయకముందే కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయని, గత ఏడాది డిసెంబర్‌లోనే చేసుకున్న అడ్మిషన్లను రద్దు చేయాలని ఎబివిపి నేతలు శనివారం నాడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎబివిపి నాయకులు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌ను కలిసి వినపతిపత్రం అందజేసినట్టు పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప తెలిపారు. బ్రాండ్ పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలాంటి ప్రకటన రాకముందే అడ్మిషన్లు పూర్తిచేశాయని, కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ఈ వ్యవహారాలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బోర్డు నిబంధనలు సాధారణ కాలేజీకే వర్తింపచేస్తున్నారని, కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లకపోవడం వెనుక రహస్యం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ఎలాంటి అనుమతి లేకున్నా కార్పొరేట్ కాలేజీలు హాస్టళ్లు నిర్వహిస్తున్నాయని, ప్రమాదరక పరిస్థితులు ఆయా కాలేజీల వద్ద ఉన్నాయని, ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ వంటలతో భోజనాలు పెడుతున్నారని, విద్యార్ధుల జీవితాలతో ఈ కాలేజీల యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.
డిఎస్సీ ద్వారానే టీచర్ల రిక్రూట్‌మెంట్ జరగాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం విప్లవకుమార్, ఎ విజయకుమార్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 25వ తేదీన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు.

చిత్రం.. ముందస్తు అడ్మిషన్లు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు కార్యదర్శి
అశోక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎబివిపి నాయకులు