తెలంగాణ

మూసీ జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, జూన్ 25: సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతూ ఆదివారం నాటికి 628.2 అడుగులకు చేరింది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఎగువ ప్రాంతాలైన భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనివల్ల ప్రాజెక్టు నీటిమట్టం గత సంవత్సరం ఈ సమయానికి 618 అడుగులు ఉండగా ఈ సంవత్సరం 628.2 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్లులోకి 200 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఏఈ మమత తెలిపారు.