తెలంగాణ

మా పెళ్ళికి శిరీష అడ్డుతగిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ‘మా పెళ్ళికి శిరీష అడ్డుతగిలింది..’ అని తేజస్వి పోలీసుల విచారణ వెల్లడించింది. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే అంశంపై ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. ఇలాఉండగా శిరీష కేసులో నిందితులు ఎ-1 శ్రవణ్, ఎ-2 రాజీవ్‌ల విచారణ కొనసాగుతున్నది. శిరీష ఆత్మహత్య కేసులో కీలకమైన శ్రవణ్, రాజీవ్‌లను తదుపరి విచారణ కోసం కోర్టు రిమాండ్ నుంచి పోలీసు కస్టడికి అప్పగించిన సంగతి తెలిసిందే. తమ పెళ్ళికి శిరీష అడ్డుపడిందని తేజస్వి చెప్పడం మామూలు విషయం కాదు. ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. శిరీష అడ్డుతగిలింది కాబట్టి ఆమెను అడ్డుతొలగించాలని రాజీవ్, శ్రవణ్ డ్రామా చేసి శిరీషను కుకునూరుపల్లి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ వద్దకు తీసుకెళ్ళి బెదిరించాలనుకున్నారా? లేక తేజస్విని శాశ్వతంగా అడ్డు తొలగించాలనుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్న తేజస్వి ఫేస్‌బుక్ ద్వారా రాజీవ్‌కు పరిచయమై, ప్రేమగా మారింది. అక్కడి నుంచి ఆమె హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుని, రాజీవ్ నడిపిస్తున్న ఆర్‌జె ఫొటోగ్రఫీ స్టూడియోకు రావడం, ఆ సమయంలో శిరీషతో కలిసి రాజీవ్ బయటకు వెళ్ళడం, అక్కడి సిబ్బంది భార్యా-్భర్తలు (రాజీవ్-శిరీష) బయటకు వెళ్ళారని చెప్పడంతో తేజస్వి హతాశురాలైంది. దీంతో ఆమె గట్టిగా రాజీవ్-శిరీషను నిలదీయడం జరిగింది. అయితే రాజీవ్ శ్రవణ్ సహకారంతో ఆమెను శిరీషను అడ్డు తొలగించాలనుకున్నారా? లేక ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి సహకారంతో తేజస్విని బెదిరించి, బెంగళూరుకు తిరిగి పంపించేయాలనుకున్నారా? అనేది సస్పెన్స్‌గానే ఉంది. ఈ కోణంలోనూ పోలీసులు అనే్వషిస్తున్నారు. తేజస్విని అడ్డు తొలగించాలనుకుంటే అది కాస్త శిరీష మృత్యువుకు ఎందుకు దారి తీసిందనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడే అసలు కథ ముడిపడి ఉంది. రాజీవ్-శ్రవణ్‌లు నిజమే చెబుతున్నారా? బుకాయిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. తేజస్విని బెదిరించాలనుకుంటే శిరీషను కుకునూరుపల్లి ఎస్‌ఐ వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది?, వీరిద్దరే అంటే శ్రవణ్, రాజీవ్ వెళ్ళి కుకునూరుపల్లి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి, రాజీవ్ జోలికి రావద్దని, హైదరాబాద్ వదిలి వెళ్ళాలని చెప్పించవచ్చు కదా? అనే ప్రశ్నకు సమాధానం రావాలి. ఇలా రకరకాల ప్రశ్నలను కుటుంబ సభ్యులూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తేజస్వి నేరుగా రాజీవ్ నివాసానికి వెళ్ళి, తాను రాజీవ్ ప్రేమించుకుంటున్నామని, పెళ్ళి చేసుకోవాలనుకున్నామని చెప్పినట్లు కూడా ఆమె పోలీసుల విచారణలో తెలిపింది.
మరో ముఖ్యమైన అంశం వెలుగు చూడాల్సి ఉంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి శిరీష పట్ల దురుసుగా ప్రవర్తించారా?, అత్యాచారానికి ఒడిగట్టారా? అనేది ఫోరెన్సిక్ నివేదికలో తేలాల్సి ఉంది. ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కూడా ఈ ఫోరెన్సిక్ నివేదికను తేటతెల్లం చేస్తుందని పోలీసులు అంటున్నారు. కాగా శిరీష ఆత్మహత్య చేసుకున్నదని, హత్య చేసినట్లు ఆధారాలు ఏమీ లభించలేదని డిసిపి వెంకటేశ్వర రావు తెలిపారు. ఆమె ఒంటరిగానే ఆర్‌జె ఫొటోగ్రఫీ స్టూడియోలోకి వెళ్ళడం, బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా, సిసి కెమెరాల ద్వారా నిరూపితమైందని ఆయన చెప్పారు. మరోవైపు రాజీవ్, శ్రవణ్‌ల విచారణ కొనసాగుతున్నది.