తెలంగాణ

ఎరువులపై జిఎస్టీ విధించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: వాల్‌మార్ట్‌ను చిల్లర మార్కెట్‌లోకి అనుమతించకూడదని, ఎరువులపై జిఎస్‌టిని విధించరాదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అరుణ్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. ఎరువులపై జిఎస్‌టిని ఏడు శాతం నుండి పనె్నండు శాతానికి పెంచటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారిపై విపరీతమైన భారం పడుతుందని హనుమంతరావు లేఖలో పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక నానాకష్టాలు పడుతున్న సమయంలో ఎరువులపై పనె్నండు శాతం జిఎస్‌టి విధించటం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్రాలపై ఐదు శాతం జిఎస్‌టి విధించటం వలన చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. ఐదు శాతం జిఎస్‌టి విధిస్తున్నందుకు నిరసనగా చిన్న వ్యాపారులు మంగళవారం నుండి మూడు రోజులపాటు బంద్ నిర్వహిస్తున్నారని లేఖలో వివరించారు.