తెలంగాణ

మమకారాన్ని చంపుకునేదెలా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, జూన్ 30: పిల్లలను అక్రమంగా విక్రయస్తున్న డాక్టర్ ఉదంతం బయటపడటంతో ఆ పిల్లలను తీసుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇన్నాళ్లూ కన్నబిడ్డకన్నా ఎక్కువగా సాకిన పిల్లలను ఇప్పుడు తమ బిడ్డలు కాదంటూ తీసుకుపోవడం న్యాయం కాదని ఆక్రందిస్తున్నారు. అక్రమంగా లింగనిర్ధారణతో అభం శుభం తెలియని ఆడసంతానాన్ని పొత్తిళ్లలోనే చంపుతున్నాడనే కారణంతో కురవి మండల కేంద్రంలోని శే్వతానర్సింగ్ హోం వైద్యుడు డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ గత నెలలో జిల్లా పోలీస్‌యంత్రాంగం నిర్వహించిన దాడుల్లో దొరికి జైలుపాలైన సంగతి పాఠకులకు తెలిసిందే. అది మరవకముందే పుట్టిన పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్నాడనే మరో కేసులో డాక్టర్ శ్రీనివాస్‌ను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణను ముమ్మరం చేశారు. కురవి మండల కేంద్రంలో అర్హత లేకున్నా గత 25 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ లింగనిర్ధారణ, ఆడశిశువులను అబార్షన్ పేరుతో చంపుతున్నాడన్న ఆరోపణల్లో గతంలో ఒకమారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జైలు పాలయ్యాడు. తీరు మార్చుకోకపోవడంతో మరల గతనెలలో కూడా మరో కేసులో జైలుకు వెళ్ల్లివచ్చాడు. రెండు రోజుల క్రితం ఖమ్మం పట్టణంలోని ఖానాపూర్ హవేలి పోలీసులు కురవికి వచ్చి డాక్టర్ ఆర్.శ్రీనివాస్‌ను ఓ అమ్మాయిని అనుమతిలేకుండా అక్రమంగా డబ్బులు తీసుకుని విక్రయించాడని కేసు నమోదు అయిన సందర్భంగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో 10సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పిల్లలను విక్రయించానని డాక్టర్ ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో కురవి మండల కేంద్రానికి చెందిన దడిగెల రవి, కానుగంటి రవి, గట్ల వెంకటేశ్వర్లు దంపతులు తాము పెంచుకుంటున్న పిల్లలను తీసుకుని ఖమ్మం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఈ పిల్లల విక్రయం చట్ట విరుద్ధమని, వారిని తమ శాఖే సంరక్షిస్తుందని శిశు సంరక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ తల్లులు పుట్టెడు దుః ఖంలో ఉన్నారు. తాము కంటికి రెప్పలా సాకామని తమ పిల్లాడిని వేరు చేయవద్దని పోలీస్, ఐసిడిఎస్ అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. తామేమీ చేయలేమని, చట్ట ప్రకారం నడుచు కుంటామని అధికారులు వారికి స్పష్టం చేశారు.
బయటపడింది ఇలా...
భ్రూణహత్యల కేసులో నిందితుడైన డాక్టర్ శ్రీనివాస్ తన ఆస్పత్రిలో ఆడపిల్లలు కాని, మగపిల్లలు కాని జన్మిస్తే తల్లిదండ్రులు సాకలేమని, లేక సమాజానికి భయపడి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకునే గర్భిణుల పిల్లలను పిల్లలు లేని తల్లిదండ్రులు(తనను ఇంతకు ముందే సంప్రదించిన) వారికి అప్పగించేవాడు. అదేవిధంగా ఇటీవల కేసుకు ముందు ఖమ్మంకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఒక పాపను ఇచ్చాడు. అక్కడ ఇంటిపక్కవారితో ఆ ప్రభుత్వ ఉద్యోగికి గొడవ కావడంతో కేసు పోలీస్‌ష్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఆ పాప ఎక్కడిదని పోలీస్‌లు విచారించడంతో కురవి డొంక అంతా కదిలింది. దీంతో 10సంవత్సరాల క్రితం పిల్లలను తీసుకుని పెంచకుంటున్న తల్లిదండ్రులకు ఈ కేసు చుట్టుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.