తెలంగాణ

మత్స్యరంగం అభివృద్ధికి వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మత్స్య రంగ సమగ్రాభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మత్స్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. గత ఏడాది రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేశామని, ఈ ఏడాది సుమారు 70 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. చేప పిల్లల కొనుగోలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల ఎన్‌సిడిసి నిధులతో మత్స్య రంగ అభివృద్ధి కోసం 2017-18, 2018-19లలో అమలయ్యే విధంగా రెండు సంవత్సరాల ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.
గొర్రెల పంపిణీ మరింత వేగవంతం
ఇలాఉండగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్దిదారులతో సమన్వయం చేసుకుని గొర్రెలను కొనుగోలు చేసి నిర్ణీత గడువులోగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు.

చిత్రం.. శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్