తెలంగాణ

కెసిఆర్‌కు గొప్ప విజన్ ఉంది మాజీ సిఎం నాదెండ్ల ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంపూర్ణమైన అవగాహనతోపాటు గొప్ప విజన్ ఉందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ప్రశంసించారు. శాసనసభలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అభినందిస్తూ నాదెండ్ల శుక్రవారం లేఖ రాశారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో కెసిఆర్‌కు ఉన్న విజన్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్పుటమైందని నాదెండ్ల పేర్కొన్నారు. నదుల వద్ద ఉన్న ఎత్తు కంటే తెలంగాణలో చాలా ప్రాంతాలు నాలుగు ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయని, దీనివల్లనే సాగునీరు అందించడం అసాధ్యమనే అభిప్రాయం గతంలో ఏర్పడిందన్నారు. ఇచ్చంపల్లి ద్వారా నీటిని అందించాలని గతంలో చేసిన ఆలోచనలు సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి ప్రణాళికతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో కూడా తాగునీరు అందించడం గొప్ప విషయంగా నాదెండ్ల లేఖలో పేర్కొన్నారు.

ఏసిబి మరింత బలోపేతం
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 1: అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ శాఖలను పటిష్టం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి నిరోధక శాఖ ఆధునీకరణకు కూడా నిధులు కేటాయించారు. ఏసిబి శాఖలో సెంట్రల్ ఇనె్వస్టిగేటింగ్ యూనిట్, ఒక ప్రత్యేక విచారణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు కేసులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమేయాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు సేకరించి దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏసిబి అవినీతి నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఏసిబి ఆధునీకరణకు రాష్ట్రప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో 1.13 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే రవాణ, ఎక్సైజ్, వాణిజ్య, అటవీ శాఖ, గనుల శాఖలతో పపాటు సంక్షేమ శాఖల్లో అవినీతిని నిర్మూలించేందుకు ఏసిబి దృష్టిని కేంద్రీకరించింది. అవినీతికి సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రజలకు వీలుగా ఉండేటట్లు 1064 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇ-మెయిల్ ద్వారా పిటిషన్లను పంపే పద్ధతిని తెలంగాణ ఏసిబి ప్రవేశపెట్టింది. త్వరలో ట్విట్టర్, వాట్సాఫ్ ఖాతాలను కూడా ప్రారంభించనుంది.ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం నష్టపోకుండా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ నిధులు, వనరులు, సామగ్రి ఆస్తుల వృథాను కనిపెడుతుంది. దర్యాప్తు నిమిత్తం కేసులను ఏసిబికి అప్పగిస్తుంది. విజిలెన్స్ శాఖ వల్ల రాష్ట్రంలో వాణిజ్య సంస్ధలు, వర్తకులు, పరిశ్రమలు, గనుల నుంచి రూ. 862.55 కోట్ల మేరకు పన్ను రావాల్సి ఉంది. ఈ శాఖ కనపరిచిన అద్భుతమైన పనితీరు వల్ల రాష్ట్ర ఖజానాకు రొ. 497.36 కోట్ల రాబడి వచ్చింది.