తెలంగాణ

ఒయులో రణరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఉస్మానియా యూనివర్శిటీలో మరోమారు రణరంగం మొదలైంది. ఏళ్ల తరబడి హాస్టళ్లలో కొనసాగుతున్న అనధికార విద్యార్థులను బయటకు పంపించే కార్యక్రమం చేపట్టినట్టు వర్శిటీ అధికారులు చెబుతున్నారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులను, తదుపరి విద్యాసంవత్సరానికి హాస్టల్ సీటు పొందని వారిని సైతం హాస్టళ్ల నుండి బయటకు పంపించేందుకు వర్శిటీ అధికారులు పోలీసుల సహాకారం తీసుకుంటున్నారు. దీంతో వర్శిటీ అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. అకస్మాత్తుగా హాస్టళ్లను ఖాళీ చేయమని చెబితే ఎక్కడకు పోవాలని వారు నిలదీస్తున్నారు. పోలీసుల సహకారాన్ని తీసుకున్నారనే వార్తను అధికారులు తిరస్కరించారు. ఇంకా పోలీసుల సహకారం తీసుకోలేదని, అవసరం అయితే పోలీసులతో విద్యార్ధులను బలవంతంగా హాస్టళ్ల నుండి పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్ధులే హాస్టళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లాలని వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌లు కోరారు. చాలా కాలంగా హాస్టళ్ల మరమ్మతులు లేవని, కొన్ని హాస్టళ్లు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో పెద్ద ఎత్తున వాటి పునరుద్ధరణ చేపట్టాల్సి ఉంటుందని ఈ విషయంలో విద్యార్థులు యాజమాన్యంతో సహకరించాలని వారు సూచించారు. అర్హులైన విద్యార్థులు హాస్టళ్లలో కొనసాగడంపై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అనధికారిక విద్యార్థులు కొనసాగడాన్ని సహించేది లేదని వారు స్పష్టం చేశారు.