తెలంగాణ

పోలీస్ శాఖలో 16మంది అసిస్టెంట్ కమాండెంట్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ పోలీస్ శాఖలో పలువురు అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయి. 16 మంది అసిస్టెంట్ కమాండెంట్లను బదిలీ చేస్తూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న టిఎస్‌ఎస్‌పి ఒకటో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం జయరాజు, మమ్నూర్ నాల్గో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. అదేవిధంగా కె సుబ్రహ్మణ్యం గద్వాల జిల్లాలోని పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా, నిజామాబాద్ ఏడో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న పి వెంకటరాములు మమ్నూర్ నాలుగో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న జయప్రకాష్ నారాయణను మంచిర్యాల జిల్లాలోని 13వ, బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఎనిమిదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తోన్న ఎస్ శ్రీనివాసరావును మమ్మూర్ నాలుగో బెటాలియన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఏ అంజయ్యను నల్గొండ జిల్లా 12వ, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గద్వాల జిల్లా పదో బెటాలియన్‌లో పనిచేస్తున్న ఎంజిఎస్ ప్రకాష్‌రావు, భూపాలపల్లి జిల్లా ఐదో బెటాలియన్‌కు, 12వ, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ బి సీతారామ్‌ను నిజామాబాద్ జిల్లా ఏడో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి 15వ, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తోన్న ఎల్ ఛత్రియ నాయక్ కొత్తగూడెం 6వ, బెటాలియన్‌కు, సిరిసిల్లరాజన్న జిల్లా అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్ సాంబశివరావు ఇబ్రహీంపట్నం మూడో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో వున్న పి సత్యనారాయణను ఖమ్మం జిల్లా 15వ, బెటాలియన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా ఏపి నుంచి వచ్చి వెయిటింగ్‌లో ఉన్న అనిల్‌కుమార్ నాయక్ డిఎస్పీ ఇంటెలిజెన్స్‌కు, టి గంగారాం, హైదరాబాద్ ఒకటో బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆంధ్రా నుంచి వచ్చి వెయిటింగ్‌లో ఉన్న ఆర్ నాగేశ్వరరావు హైదరాబాద్ ఆర్‌బివిఆర్‌ఆర్ టిఎస్‌పిఏ డిఎస్పీగా, ఎస్ శ్రీ్ధర్‌రాజు సత్తుపల్లి 15వ, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా, కెవి రవిచంద్రను రంగారెడ్డి జిల్లా 8వ, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.