తెలంగాణ

తెలంగాణ తొలి తెలుగు మహాసభల లోగో ఆవిష్కరించిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభలు, తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోలను మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్ రూపొందించగా, సాహిత్య అకాడమీ లోగోను సిద్ధిపేటకు చెందిన చిత్రకారుడు ఎంవి రమణారెడ్డి రూపొందించారు. తెలుగు మహాసభల లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాశీ చిత్రరీతిలో రూపొందించినట్టు కళాకారులు వివరించారు. అలాగే లోగో పే భాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రకరించి దానిపై ‘మన తెలంగాణము-తెలుగు మాగాణము’ అనే వ్యాక్యం కనిపించేలా చిత్రీకరించినట్టు వివరించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రికరించి, హంస ముక్కు స్థానంలో పాళి కనిపిస్తుందన్నారు. హంస కింద పుస్తకం పుటలను నీటి అలలుగా చిత్రికరించినట్టు వివరించారు. ఈ లోగో పై భాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్టు చిత్రికరించినట్టు పేర్కొన్నారు. లోగో మధ్యలో పాల్కురికి సోమన పద్యభాగం ‘సరసమై బరిగిన జాను తెనుగు’ అనే పద్యపాదాన్ని చేర్చించినట్టు కళాకారులు వివరించారు.

చిత్రాలు.. ప్రపంచ తెలుగు మహాసభల లోగో. రూపొందించిన చిత్రకారుడు రవిశంకర్.
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో. రూపొందించిన చిత్రకారుడు ఎం.వి.రమణారెడ్డి