తెలంగాణ

దమ్ముంటే మూసీ నీళ్లు తాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, జూలై 13: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దమ్ముంటే కలుషితమైన మూసీ నీళ్లు తాగి అసెంబ్లీకి వెళ్లాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సవాల్ చేశారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో మూసీపై రైతు పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. మూసీ నది బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్‌రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న కెసిఆర్ రాష్ట్రాన్ని బాధల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాజధానిలో విస్తరించిన కొన్ని పరిశ్రమలు హానికరమైన వ్యర్ధాలను మూసీలో వదులుతున్నాయని, దీంతో పండిన పంట సరైన దిగుబడి రాకపోవడం, ప్రజలు, మూగ జీవాలకు వింత వ్యాధులు సంభవించడం, చేపలు చనిపోయి మత్య్స కార్మికులు నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేస్తేనే కెసిఆర్ హీరో అని, లేదంటే జీరోనని ఎద్దేవా చేశారు. మూసీ నది ఏడు జిల్లాల్లో విస్తరించి ఉందని, మూసీలో 9 రోజుల పాటు ముఖ్యమంత్రి ముఖం కడుక్కోవాలని, లేదంటే రాజకీయాలను విడిచిపెట్టాలని ఆయన సవాల్ చేశారు. లేని పక్షంలో మూసీ నది ప్రక్షాళన చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. సామాన్యులకు వౌలికమైన అధికారాలున్నాయని, మానవ మనుగడకు నీరే జీవనాధారమని, జీవించే అధికారానికి ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. తెలంగాణలో చరిత్రను మలుపుతిప్పేది రైతు పంచాయతీ కార్యక్రమమని ఆయన కొనియాడారు. మూసీ నది ప్రక్షాళన కోసం అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి.శ్యాంసుందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ధనుంజయ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, శాస్తవ్రేత్త ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, ప్రముఖ జర్నలిస్ట్ కె.ప్రసాద్, శివకుమార్, రామకృష్ణ, రంగారెడ్డి, రవికుమార్, కళ్యాణ్, బొడ్డు జనార్ధన్, గణేష్ యాదగిరి పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

రాజకీయ లబ్ధికే రైతు ధర్నాలు