తెలంగాణ

నేడు ఒక్కరోజే 28 లక్షల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఒక్క రోజులోనే ఈ నెల 15వ తేదీన తెలంగాణలో 28 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మూడో దశ హరితహారంలో భాగంగా విద్యాశాఖ మొక్కలు నాటే పండగను ఒక యజ్ఞంలా నిర్వహించనుందని అన్నారు. జూలై 15వ తేదీన గ్రీన్‌డే పాటిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం రూపొందించామని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకే గ్రీన్ డే ప్రారంభం అవుతుందని, ఉదయం 8.30 నుండి 9.30 వరకూ ప్రతి పాఠశాల వద్ద హరిత పాఠశాల, హరిత తెలంగాణ పేరుతో నినాదాలిస్తూ మొక్కల ఆవశ్యకతను గ్రామంలో పట్టణంలో తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహిస్తారని అన్నారు. ఉదయం 9.30 నుండి 10.30 వరకూ రాష్టవ్య్రాప్తంగా 28 లక్షల మొక్కలను పాఠశాల ఆవరణల్లో నాటుతారని చెప్పారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ హరిత హారం కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, నాటికలు, క్విజ్ మొదలైన పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు అందిస్తారు. హరితహారం మొక్కలను నాటడానికే పరిమితం కాకుండా వాటిని సంరక్షించేందుకు విద్యార్ధులు, ఉపాధ్యాయులతో గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటిన మొక్కలను దత్తత తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవడమే ఈ బ్రిగేడ్ల లక్ష్యమని ఆయన వివరించారు. కాగా కొన్ని స్కూళ్లలో విశాలమైన ఖాళీ స్థలాలు ఉండటంతో అక్కడ బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్‌కు అవకాశం లేని చోట ప్రహరి గోడ దగ్గర నాలుగైదు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు. ప్రహరి గోడలు లేని స్కూళ్లలో మొక్కలకు ఖచ్చితంగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
గవర్నర్ హాజరు
గ్రీన్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగే హరితహారం కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు పాలమాకుల మోడల్ స్కూల్‌లో జరిగే హరితహారంలో కూడా ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు.
సిద్ధమైన యూనివర్శిటీలు
హరితహారం కోసం యూనివర్శిటీలు సైతం సిద్ధమయ్యాయి. జెఎన్‌టియు, ఉస్మానియా యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీ, ఇఫ్లూల్లో హరితహారం కోసం భారీ ఏర్పాట్లు చేశారు.