తెలంగాణ

రానున్న వారం రోజులూ వర్షం అంతంత మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: వర్షా కాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడచినా సరిపడా వర్షాలు పడలేదు. గడచిన నెల రోజుల్లో రెండు, మూడు సార్లు భారీ వర్షాలు కురిశాయి తప్ప చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. రుతుపవనాలు బలహీన పడ్డంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు ముఖం చాటేయడంతో మరో వైపు జలాశయాల్లోనూ నీటి మట్టాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రానున్న మిగిలిన రెండు మూడు నెలల్లోనైనా వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయనే దానిపై సందిగ్ధం నెలకొంది. మరో వైపు వాతావరణ శాఖ, ప్రభుత్వం కూడా ఈ ఏడాది గత ఏడాది కన్నా అధికంగా వర్షపాతం నమోదు అవుతుందని ఇప్పటికే ప్రకటించాయి. కానీ ఆశించిన వర్షం కురవ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ లెక్క ప్రకారం ఈ నెల 14 నుంచి 21 వరకు వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అంతంతమాత్రంగానే కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న-సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, యాదగిరి-్భవనగిరి, జనగామ్, మెదక్, సంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్-్భపాలపల్లి, వరంగల్ (అర్భన్), వరంగల్ (రూరల్), మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే 18వ తేదీన మాత్రం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ఓత్తిడి తగ్గి బలహీన పడ్డంతో వర్ష ప్రభావం కూడ తగ్గింది. ముఖ్యంగా ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటే, 18న మాత్రం కొంచెం వర్షపాతం అధికంగా కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 18న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన వర్షపాతంలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లిలో 99.00 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది.