తెలంగాణ

పది రోజులు సెలవులపై డిఐజి అకున్ సబర్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ డ్రగ్ మాఫియా వెన్ను విరుస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డిఐజి అకున్ సబర్వాల్ శనివారం నుంచి పదిరోజుల పాటు సెలవుపై వెళుతున్నట్లు సమాచారం.ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆయన సెలవుపై వెళుతున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. చివరి నిమిషంలో మార్పు జరిగితే తప్ప సెలవును రద్దుచేసుకోవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన సబర్వాల్ సినీపరిశ్రమతో పాటు, ఇంజనీరింగ్ కాలేజీలో మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించడమే కాకుండా, వారికి డ్రగ్‌ను చేరవేస్తున్న వారిని అరెస్టు చేయడంలో కీలక పాత్రవహిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మాదకద్రవ్యాలుసేవించినట్లు అభియోగాలు ఉన్న వారిని ఎక్సైజ్ శాఖ విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అకున్ సబర్వాల్ సెలవుపై వెళుతున్నారనే సమాచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.