తెలంగాణ

కార్పొరేటర్ అనిశెట్టికి నేతల నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 14: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. పాతకక్షల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న కార్పొరేటర్ మురళిని ఆయన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపిన విషయం తెలిసిందే. మురళి మృతదేహానికి శుక్రవారం ఉదయం ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిగింది. మార్చురీ వద్దకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకున్నారు. మురళికి శ్రద్ధాంజలి ఘటించటంతోపాటు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం ఉదయం వరంగల్‌కు చేరుకుని నేరుగా మార్చురీకి వెళ్లారు. మురళి మృతదేహాన్ని పరిశీలించి సంఘటనపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ మురళి దారుణహత్య హేయమని, నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తామని చెప్పారు. మార్చురీ వద్దకు ఎంపిలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, నగర మేయర్ నరేందర్, కుడా చైర్మన్ యాదవరెడ్డి, పలువురు కార్పొరేటర్లు చేరుకుని మురళికి నివాళులు అర్పించారు. రేవూరి ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క, గండ్ర సత్యనారాయణ, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు మురళికి నివాళులు అర్పించారు.

చిత్రం.. మురళి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న డిప్యూటీ సిఎం కడియం