తెలంగాణ

సంగారెడ్డి కలెక్టర్ సర్క్యులర్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: విద్యార్ధులను బయటకు తీసుకువెళ్లే ఉద్యమ నాయకులపై కేసులు పెట్టాలని, అలా చేయకుంటే ఆయా విద్యాసంస్థల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్లపై కేసులు పెట్టాలని పేర్కొం టూ సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన సర్క్యులర్‌పై విద్యార్ధి సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు, టిపిఇఆర్‌ఎం కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, టిఎస్‌ఎఫ్ కార్యదర్శి ఎం శోభన్ నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ సభ్యుడు ఎ దివాకర్, డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు కె విజయ్ తదితరులు మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. ఇది విద్యార్ధుల హక్కులకు భంగకరంగా ఉందని వారు పేర్కొన్నారు.