తెలంగాణ

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ఔషధ సేవలు వౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) మేనేజింగ్ డైరక్టర్ రామరాజు వేణుగోపాలరావు చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కెసిఆర్ కిట్ల పథకం, డయాలసిస్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంక్‌లు, లేబర్ రూంలు, ఐసియూల ఏర్పాటు పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు. శనివారం నాడిక్కడ కోఠిలోని తన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆయా పథకాల అమలు తీరుపై సంస్థ అధికారులతో వేణుగోపాలరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవలు, వౌళిక సదుపాయాల కల్పనలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. కెసిఆర్ కిట్ల పథకం, డయాలసిస్ సెంటర్లు, బ్లడ్ బ్యాంక్‌లు, ఐసియుల నిర్మాణం వంటి పనులను వేగంగా, సమర్ధవంతంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 హాస్పిటళ్లలో 268 డయాలసిస్ మిషన్లను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. సిద్ధిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో ఐసియులు సిద్ధంగా ఉండగా, కొత్తగా 17 ఐసియులను టివివిపి హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గద్వాల, జహీరాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మెదక్, ఉట్నూర్, నిర్మల్, సిరిసిల్ల, మహబూబాబాద్, ఏటూరు నాగారం, కామారెడ్డి, భద్రాచలం, ఖమ్మం, సంగారెడ్డి, నారాయణపేట, మంచిర్యాల తదితర హాస్పిటళ్లలో కొత్తగా ఐసియులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కాగా 13 కొత్త బ్లడ్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. కొనసాగుతున్న అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెస్తే ప్రభుత్వానికి వెంటనే పంపించి పరిష్కరించుకుందామని అధికారులకు వివరించారు.