తెలంగాణ

పళ్లతోటల వివరాలు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర వ్యాప్తంగా పళ్లతోటల వివరాలను సమగ్ర నివేదికగా రూపొందించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. నాబార్డు సహకారంతో 2016-17, 1017-18 సంవత్సరాలకు అమలవుతున్న సూక్ష్మ నీటిపారుదల (ఎంఐపి) పై శనివారం ఆయన ఇక్కడ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇస్తోందని, ఎంఐపి వల్ల నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో ఎంఐపిని పెద్దఎత్తున చేపట్టామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైతులకు ఎంఐపి పరికరాలను నూటికి నూరుశాతం సబ్సిడీపై ఇస్తున్నామని, ఈ విషయం రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిలందరికీ తెలియచేయాల్సి ఉందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైతులంతా వారికి కల్పించిన ఈ సౌకర్యం వినియోగించుకునే పరిస్థితి, అవకాశం ఉండేలా చూడాలన్నారు.
ఎంఐపి పథకంలో భాగంగా ఉన్న సంబంధిత కంపెనీల ప్రతినిధులు రైతులకు పూర్తిగా సహకరించాలని పార్థసారథి సూచించారు. జిల్లాల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని కోరారు. రైతులకు అందచేసే పరికరాలు నాణ్యతగా ఉండేలా చూడాలని, వీటి నిర్వహణలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ఉద్యాన శాఖాధికారులు-ఎంఐపి కంపెనీల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వ లక్ష్యాలకు సాధించేందుకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు పి. సత్యప్రసాద్, నాబార్డ్ జనరల్ మేనేజర్ సిఎస్‌ఆర్ మూర్తి, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మల్కిత్ సింగ్, నాబార్డ్ అధికారులు, ఉద్యాన అధికారులు, థర్డ్‌పార్టీ ఏజన్సీగా పనిచేస్తున్న నాబ్కాన్స్ పాల్గొన్నారు.