తెలంగాణ

పాలిటెక్నిక్‌లో సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో 44,451 సీట్లు ఉండగా ఇంత వరకూ 31,312 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు మిగిలినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో 1,09,088 మంది అర్హత సాధించారు. సర్ట్ఫికేట్లపరిశీలనకు తొలి దశలో 41,069 మంది, రెండో దశలో 2542 మంది హాజరయ్యారు. తొలి దశలో 32,244 మందికి సీట్లు కేటాయించగా అందులో 22,447 మంది కాలేజీల్లో చేరారు. రెండోదశలో కేటాయించిన సీట్లతో మొత్తం 31,312 సీట్లు భర్తీఅయ్యాయని ఆమె పేర్కొన్నారు. 57 ప్రభుత్వ కాలేజీల్లో 11867 సీట్లకు 11326 సీట్లు భర్తీ అయ్యాయి. ఎయిడెడ్‌లో రెండు కాలేజీల్లో 420 సీట్లకు 412 , ప్రైవేటులో 126 కాలేజీల్లో 32,164 సీట్లకు 19574 భర్తీ అయ్యాయి. ఈ నెల 19వ తేదీలోగా ఫీజులు చెల్లించి కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు.