తెలంగాణ

పార్లమెంటులో బిసి బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి యువజన సంఘం తీర్మానించింది. శనివారం యువజన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిసి సంక్షేమ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిసి యువజన సంఘం పలు తీర్మానాలు ఆమోదించింది.
బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసిలకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫీజుల రియంబర్స్‌మెంట్ స్కీమ్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది.
రాజ్యాంగబద్ధత: దత్తాత్రేయ
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పలువురు నాయకులు శనివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించగా, ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.