తెలంగాణ
పెరిగిన భూగర్భ జలాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 July 2017
హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు వర్షాలు బాగా ఉండటం వల్ల భూగర్భజలాల పరిస్థితి మెరుగైందని భూగర్భజలశాఖ శనివారం ప్రకటించింది. 2016 మే నెలతో పోలిస్తే2017 జూన్లో భూగర్భజలమట్టం 3.76 మీటర్లుపెరిగింది. గత నెలలో తెలంగాణలోని 25 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా నీరు భూమిలోకి ఇంకడంతో భూగర్భజలాలు పెరిగాయి. పీజోమీటర్ ద్వారా భూగర్భజలాల మట్టాలను పరిశీలించారు. 60 మండలాల్లో నీటిమట్టం 20 మీటర్ల వద్ద ఉండగా, 83 మండలాల్లో 15 నుండి 20 మీటర్ల మధ్య ఉంది. నీటి సంరక్షణా చర్యలు చేపట్టడం వల్ల ఈ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేశారు.