తెలంగాణ

ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జూలై 15: ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో శనివారం రాత్రి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నాన్‌బోర్డర్స్‌ను ఏరివేయడానికి ఒకవైపు ఓయు అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టగా మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఓయు పోలీసులు అదనపుబలగాలను మొహరించి సిద్ధంగా ఉన్నారు. శనివారం ఒయు నాన్‌బోర్డర్స్‌ను ఏరివేయాలన్న లక్ష్యంతో అధికారులు హాస్టల్స్‌కు విద్యుత్, నీటి కనెక్షన్‌ను తొలగించారు. దీంతో విద్యార్థులు రెచ్చిపోయారు. సాయంత్రానికి పెద్దయెత్తున గుమిగూడి వైస్ ఛాన్సలర్ నివాసం వైపు పరుగులు తీశారు. పెద్దఎత్తున చేరుకున్న విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆందోళనకు పూనుకున్నారు. తమకు న్యాయం చేయాలని, నాన్‌బోర్డర్స్ ఉన్నారన్న నెపంతో తమకు ఇబ్బందులు కలిగించడం సరికాదని పేర్కొన్నారు.తమపై కావాలని కక్షసాధింపు దోరణికి అధికారులు స్వస్తిపలకాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయక తప్పదని విద్యార్థులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఎలాంటి సంఘటనలు జరిగినా సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ముందుగానే బలగాలతో మోహరించారు. దశల వారి విద్యార్థులపై వత్తిడి పెంచి నాన్‌బోర్డర్‌లను తొలగించాలని ఓయు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హాస్టల్స్ సదుపాయాలు తొలగించిన అధికారులు,సోమవారం నుంచి అప్పటికే గుర్తించిన నాన్‌బోర్డర్స్‌పై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టులు కొనసాగించాలని ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా ఓయు నుంచి వెళ్లేందుకు ససేమిరా అంటున్న విద్యార్థులు ఒకవైపు ఎలాగైనా తరిమేస్తామంటున్న అధికారులతో ఓయులో తాజాగా మరోసారి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో వీరంతా చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించడంతో ఉస్మానియాలో ఉద్రిక్తత కొనసాగింది.

చిత్రం.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులు