తెలంగాణ

31మంది అధికారులకు ప్రమోషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్నతస్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రమోషన్ ఇస్తూ డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇంధన) అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ సభ్యుడు ముఖ్యకార్యదర్శి (సర్వీసులు) అదర్ సిన్హా కలిసి ప్రమోషన్ల అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 31 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో 27 మంది యునాని డాక్టర్లు కాగా, భూగర్భజలశాఖకు చెందిన ఒకరికి జాయింట్ డైరెక్టర్‌గా, స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారికి అడిషన్ ఐజిగా, దేవాదాయ శాఖకు చెందిన ఒకరికి అడిషనల్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.