తెలంగాణ

అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులకు 26 వరకూ దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఈ నెల 26 లోగా అందించేందుకు అవకాశం ఇచ్చామని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ ఎంసెట్-2017 లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వ్యవసాయ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి రైతుల కోటాలో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగుసంవత్సరాల పాటు చదివి ఉండాలని, వారి తల్లిదండ్రులకు కనీసం మూడు ఎకరాలభూమి ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఫారం 1, ఫారం 2 లను భర్తీచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నుండి పొందవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.