తెలంగాణ

నగదు కొరతతో అప్పుల్లో రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకల్లో నగదు కొరతో రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రైతులు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవాలన్నా, రుణాలు పొంది తద్వారా నగదు స్వీకరించాలన్నా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నరకయాతన పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ నరసింహన్‌ను శనివారం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్యాంకల్లో నగదు కొరత వల్ల రైతులు బయట అప్పులు చేసి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని నగదు కొరత సమస్యను తీర్చాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని, రైతుల ఆత్మహత్య హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలు గవర్నర్‌కు ఆ వినతిపత్రంలో వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం వీరంతా విలేకరులతో మాట్లాడుతూ ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసిందని, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు వెళ్లిన రైతులు బ్యాంకుల్లో నగదు లేక నిరాశగా వెనుదిరిగి రావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో రైతుల సొమ్ము బ్యాంకుల్లో ఉండిపోయి, బయట అప్పులు చేసుకుంటూ వాటికి వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేస్తున్నారని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాణిజ్య బ్యాంకుల శాఖల్లో నగదు నిల్వలు ఉండడం లేదని తెలిపారు. రైతు రుణమాఫీ అమలు చివరి దశకు చేరినా ఆ పథకం రైతులను అప్పుల పాలు కాకుండా నివారించ లేకపోయిందని, ఇంకా బ్యాంకుల వద్దే రైతుల పాస్ పుస్తకాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. రైతులు ఇంత సంక్షోభంలో ఉన్నప్పటికీ రూ.790 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రైతులపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. బ్యాంకల్లో నగదు లేక, ఉన్నా దొరకక, ప్రైవేటు వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కుకుంటున్నారని వాపోయారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.
చిత్రం.. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు