తెలంగాణ

‘హైకోర్టును వెంటనే విభజించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ఉమ్మడి హైకోర్టు విభజన వెంటనే చేయాలని అఖిలపక్షం సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గ్రానైట్, చేనేత రంగంపై జీఎస్టీవల్ల పడే భారాన్ని కేంద్రానికి వివరించినట్టు తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా హైకోర్టు విభజన చేయాలని కోరామని చెప్పారు. శాసనసభ సీట్లను పెంచాలన్న అంశాన్ని లేవనెత్తామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, పత్తికి మద్దతు ధర ముందుగానే నిర్ణయించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. జీఎస్టీకి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారని జితేందర్‌రెడ్డి వివరించారు.