తెలంగాణ

ఎలైట్ మోడల్ లుక్ 2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలుగొందుతున్న ఎలైట్ మోడల్ లుక్ ఇండియా 2017 పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రాంతీయ దశ పోటీలను నిర్వహించడంతో ఈ పోటీ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. అతిపెద్ద ఫ్యాషన్ ఫార్వర్డ్ బ్రాండ్ మాక్స్, అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎలైట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ సూపర్ మోడల్‌గా నిలువాలని తరలివచ్చే యువతీ యువకులకు ఇది గొప్ప అవకాశమని తెలిపారు. ప్రాంతీయ పోటీల నుంచి జాతీయ పోటీలకు నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. జాతీయ స్థాయి పోటీలు ఆగస్టు 30న ముంబయిలో నిర్వహించనున్నారు.