తెలంగాణ

అవకతవకలకు ఇక ఆస్కారం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: భూ ఆక్రమణలు, డాక్యుమెంట్ల తారుమారుకు అవకాశం లేకుండా భూముల రికార్డులను పటిష్టంగా తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రం మొత్తం మీద 10 వేల గ్రామా ల్లో ఉన్న అసైన్డ్ భూములు ఏమయ్యాయో, ఎక్కడ ఉన్నాయో కూడా విచారణ చేసి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మిగులు భూములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనే వాటి వివరాలను కూడా వెలికి తీయనుంది. రాష్ట్రప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి భూ రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు 16 ముఖ్యమైన అంశాలను రెవెన్యూ శాఖ అధికారులకు ప్రభు త్వం స్పష్టం చేసింది. దీంతో అధికార యంత్రాంగం భూ రికార్డులపై ల్యాండ్ రికార్డుల మ్యూటేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. అసలు హక్కుదారులు ఆ భూమి మీద ఉన్నారో లేదోనని గుర్తించడం, అనంతరం పహాణీ రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉందని కూడా ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి భూములను పంపిణీ చేసింది. కానీ గ్రామంలోని మ్యాప్‌లో వాటి వివరాలు ఎక్కడా పొందు పర్చలేదు.
ఇందుకోసం మరో ప్రత్యేక సర్వే చేపట్టి పంపిణీ చేసిన భూముల వివరాలను నోటిఫై చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో మిగులు భూములు ఎక్కడ ఉన్నాయనే విషయంలో కూడా సరిగా డిమార్కింగ్ చేయలేదు. వెయ్యి చదరపు మీటర్ ఒక ఫ్యామిలీకి ఉండాల్సి ఉంటే, నాలుగు వేల చదరపు మీటర్లు ఉంటే మిగిలిన 3 వేల చదరపు మీటర్లు మిగులు భూమి కిందకు వస్తుంది. ఈ తరహా భూముల సమాచారం సరిగ్గా లేకపోవడం వల్ల చాలా భూమి అన్యాక్రాంతం అవుతుంది.