తెలంగాణ

హార్వర్డ్ సమ్మర్ క్రాస్‌రోడ్ శిక్షణకు సాంఘిక సంక్షేమ విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి, వారి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ (సాయి) నిర్వహించే క్రాస్‌రోడ్ సమ్మర్ ప్రోగ్రాంకు తెలంగాణకు సాంఘిక సంక్షేమ విద్యాసంస్థ విద్యార్థి ఆనంద్ ఎంపికయ్యారు.
2017 ఆగస్టు 11 నుండి 14 వరకు డిఐఎఫ్‌సి అకాడమీ ఆఫ్ ది దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (దుబాయ్ యూ ఎఇ)లో శిక్షణ నిర్వహిస్తున్నారు. హార్వ ర్డ్ యూనివర్సిటీ సొంత ఖర్చుతో నిర్వహించే ఈ శిక్షణకు విద్యార్థులు ఎంపిక కావడం గొప్ప విషయం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదవడం వల్ల తనకు ఈ అవకాశం వచ్చిందని ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆనంద్ ఎంపిక కావడం పట్ల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కమిషనర్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయి విద్యార్థులు కూడా ప్రతిభ కనబరుస్తారనడానికి ఆనంద్ ఆదర్శంగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు.