తెలంగాణ

టిఎస్ ఎంసెట్ 2 మెడికల్ ప్రశ్న పత్రం లీకేజీ కేసు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఏడాది కింద జరిగిన టిఎస్ ఎంసెట్ 2 మెడికల్ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో నిందితులపై సమగ్ర నేరారోపణ పత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు సిఐడి అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు ముమ్మరం చేశారు.
ఈ కేసులో సూత్రధారి ఎస్.బహదూర్‌సింగ్ ఢిల్లీలోని ప్రశ్నపత్రాల ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది సహకారంతో ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. కరడుగట్టిన నేరగాడు బహదూర్‌సింగ్ 2005లోనూ ఇదే తరహా నేరానికి పాల్పడ్డాడు. లీకేజీ కేసుల్లో ఆరితేరిన బహదూర్‌సింగ్‌కు ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందితోనే కాకుండా విద్యాసంస్థల కనె్సల్టెన్సీ యజమానులు, దళారులతో వీపరీతమైన పరిచయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. లక్నోలో నిర్వహించిన రైల్వే గ్రూప్ డి పరీక్ష, అలహాబాద్‌లో నిర్వహించిన రైల్వే డ్రైవర్లు పరీక్ష, టెట్, పంజాబ్‌లోని పిఎస్‌సి పరీక్ష లీకేజీ, జమ్మూ కశ్మీర్‌లో ఉపాధ్యాయ పరీక్ష, మహారాష్టల్రోని వార్ధా మెడికల్ కాలేజీ పేపర్ లీకేజీ, ఛండీఘడ్ టీచర్ల లీకేజి కేసు, కోల్‌కత్తా టెట్ పరీక్ష, డిఎంఆర్‌సి పరీక్ష పేపర్ల లీకేజీతో నిందితుడు బహదూర్‌సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. సమగ్ర నివేదికలో వీటిని ఉదహరించే అవకాశం లేకపోలేదు. గత ఏడాది మెడికల్ పేపర్ లీకేజీ కేసులో 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సాక్ష్యులుగా చార్జిషీట్‌లో పేర్కొంటున్నట్లు తెలిసింది. నిందితుడిని పట్టుకున్న తర్వాత సుమారు రూ.3కోట్ల విలువైన స్ధిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విద్యా కనె్సల్టెన్సీ యజమానులు, దళారులు, ప్రొఫెసర్లు, డాక్టర్లకు కలిపి మొత్తం 60 మంది వరకు సంబంధం ఉన్నట్లు సిఐడి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 20న డిజిపి అనురాగ్‌శర్మ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.