తెలంగాణ

ముమ్మాటికీ ప్రభుత్వ పైశాచికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉండి పోరాడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అనేక పోటీ పరీక్షలకు ప్రిపేయరవుతూ వర్శిటీల్లోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్ధులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్నారు. ఉస్మానియా వర్శిటీ ఉపాధ్యక్షు డు పోలీసులను వెంట పెట్టుకుని విద్యార్ధులను ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఉస్మానియా హాస్టళ్లకు నీరు, విద్యుత్‌ను బంద్ చేశారన్నారు. విద్యార్ధుల పట్ల రాష్ట్రప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందన్నారు. వర్శిటీలో ఉన్న ఆరు వేల మంది విద్యార్ధులు టీచర్ పోస్టులకు ప్రిపేరవుతుంటే, శనివారం రాత్రి పోలీసులు, అధికారులు వారిని చుట్టుముట్టడం తగదన్నారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులను హాస్టళ్లలో బస చేసేందుకు గతంలో అనుమతించేవారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విద్యార్ధుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారన్నారు. పేద విద్యార్ధులను వర్శిటీ హాస్టళ్లలో ఉండేందుకు అనుమతించాలన్నారు. విద్యార్ధులను అధికారులు ఎందుకు వేధిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
ఉదయం 10 గంటలకు సిఎల్‌పి సమావేశం
రాష్టప్రతి ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉద యం 10 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం సిఎల్‌పి కార్యాలయంలో జరుగుతుంది. ఈ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు వీలుగా, ఓటింగ్ ప్రక్రియపై సిఎల్‌పి నేత జానారెడ్డి ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.