తెలంగాణ

సేంద్రీయ సేద్యానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణలో సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ (గురు రవిశంకర్) సంస్థకు చెందిన ప్రతినిధులు రాష్ట్ర పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరా రు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైనె్సస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ (తెలంగాణ, ఎపి, తమిళనాడు) ఇంచార్జి ఉమామహేశ్వరి తదితరులు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. సేంద్రీ య వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల తయారీ తదితర అంశాల్లో తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆమె పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ద్వారా మంత్రికి వివరించారు. ఎపితో సహా దేశంలోని 18 రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సంస్థ ఒప్పందం చేసుకున్నదని, ఆయా రాష్ట్రాలు సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పా టు అందిస్తోందన్నారు. సేంద్రీయ సేద్యం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటల దిగుబడి సాధించేందుకు వీలుందన్నారు. దేశవ్యాప్తంగా తాము 1500 మంది ఆదర్శ రైతులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా రైతులందరికీ శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. వెదురుబొంగులతో తక్కువ వ్యయంతో పాలీహౌజ్‌లు నిర్మించుకునేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. నీటి సంరక్షణ, వర్షపునీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివిం గ్ సంస్థ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి, ప్రభుత్వం ఏ మేరకు వీరి సహా య, సహకారాలు తీసుకునేందుకు అవకాశం ఉందో పరిశీలించాలని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ (సెర్ప్) సిఇఓ పౌసమి బసుకు మంత్రి జూప ల్లి ఆదేశాలు జారీ చేశారు.

చిత్రం.. మంత్రి జూపల్లితో సమావేశమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు