తెలంగాణ

తెలంగాణ వర్సిటీలకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఉస్మానియా, కాకతీయలతో పాటు తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని విశ్వవిద్యాలయాల వైస్-్ఛన్సలర్లకు ఉపముఖ్యమంత్రి, విద్యామంత్రి కడి యం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. 2017-18 సంవత్సరానికి సంబంధించిన విశ్వవిద్యాలయాల కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు హైదరాబాద్ (నాంపల్లి- రూసా భవనం) లో విసిలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు విద్య, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విశ్వవిద్యాలయాలకు చెందిన హాస్టళ్ల నుండి నాన్‌బోర్డర్లు గదులను ఖాళీ చేసేందుకు ఈ నెల 23 వరకు అవకాశం ఇవ్వాలని వచ్చిన విజ్ఞప్తిపై పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని కడియం స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో రాజకీయాలకు తావు ఉండవద్దని, సమావేశాలకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. కాలేజీలు, హాస్టళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భావిస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు సార్లు విసిలతో తాను సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించానని కడియం గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణ, నియామకాలు, బోధన సరిగ్గాలేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, పిహెచ్‌డి ప్రవేశాలు పారదర్శకంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ అంశాలపై విసిలు ప్రత్యేక శ్రద్ద తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ దృష్టికి విసిలు తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ ముఖ్యమం త్రి పరిష్కరిస్తున్నారని, 1550 పోస్టుల భర్తీకి కూడా ఆమోదించారని గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా విసిలు సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని, యూనివర్సిటీల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు.
దేశంలో మొదటిస్థానం
ఉన్నతవిద్య-2016 కు సంబంధించి జాతీయ స్థాయిలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో వివిధ అంశాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నట్టు తేలిందని ఉపముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలో 18-23 ఏళ్ల వయస్సున్న విద్యార్థులపై సర్వే చేస్తే, విద్యాసంస్థల్లో ఈ వయస్సులో ఉన్నవారు జాతీయ స్థాయిలో 18 శాతం ఉండగా, తెలంగాణలో ఈ శాతం 23 గా ఉందన్నారు. ఎస్‌సి విద్యార్థుల నమోదులో తెలంగాణ మొదటిస్థానంలో, ఎస్‌టి విద్యార్థుల నమోదులో రెండోస్థానంలో నిలిచిందన్నారు. పరిశోధనా అంశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు కొంత వెనుకబడి ఉన్నట్టు తేలిందని, అందువల్ల పరిశోధన అంశంలో విసిలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు పెంచుకునేందుకు అంతర్జాతీయంగా పేరున్న విశ్వవిద్యాలయాలతో విద్యాబోధన, పరిశోధనాంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటే సత్ఫలితాలు వస్తాయన్నారు.
విశ్వవిద్యాలయాల్లో వౌలిక వసతుల కోసం ప్రభు త్వం విడుదల చేసిన 420 కోట్ల రూపాయలను సద్వినియోగం చేయాలని, అవకతవకలకు, అక్రమాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 1550 పోస్టుల భర్తీకి ఆమో దం తెలపగా, 1061 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. యూ జిసి నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగిద్దామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ, వేతనాల హెచ్చింపు తదితర అంశాలకు సంబంధించి అధ్యయనం జరుగుతోందని, ఈ అధ్యయన నివేదిక రాగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశం లో విసిలతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ రక్కర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణిప్రసాద్, మాధ్యమిక విద్య కమిషనర్ అశోక్, ప్రాథమిక విద్య సంచాలకులు కిషన్ పాల్గొన్నారు.
నాన్ బోర్డర్లపై త్వరలో నిర్ణయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో వివిధ పరీక్షలకు సిద్ధమవుతున్న నాన్‌బోర్డర్లు ఈ నెల 23 వరకు హాస్టళ్లలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని, ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తెలియచేస్తామని కడియం శ్రీహరి తెలిపారు. యూనివర్సిటీల్లో కొత్తగా ప్రవేశాలు పొందేవారికి గదులు కేటాయించేందుకు వీలుగా కోర్సులు పూర్తి చేసిన పాత విద్యార్థులు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో, అనుబంధ కాలేజీల్లో ర్యాగింగ్, డ్రగ్స్‌కు ఎట్టిపరిస్థితిలోనూ అవకాశం ఇవ్వవద్దని, ఈ అంశంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కాలేజీలు, హాస్టళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చరిత్ర ఉందని, తెలంగాణ ఏర్పాటులో కీలకభూమిక పోషించిందన్నారు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లు కావవడంతో సభలు, సమావేశాలకు, రాజకీయాలకు వేదికగా ఉస్మానియాను ఉపయోగించవద్దని, కేవలం విద్య, పరిశోధనలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

చిత్రం.. హైదరాబాద్ (నాంపల్లి- రూసా భవనం) లో ఆదివారం విసిలతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి