తెలంగాణ

భూ సేకరణకు వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ములుగు, జూలై 17: ప్రాజెక్టుల నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని, 2013 జీఓ సవరణ ప్రకారమే ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలన్నదే తమ డిమాండ్ అని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా బహిళింపూర్‌లో ముంపు బాధితులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కష్టార్జితమైన ఆస్తిని అధికారులు లాక్కోవడం తగదని, పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన అనంతరమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ముఖ్యంగా గతంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్మాణానికి అప్పటి పాలకులు పరిహారం చెల్లించలేదని, మభ్యపెట్టే హామీలతో ఎలాంటి జీఓలు విడుదల చేయకుండా నమ్ముకున్న భూములను బెదిరింపులతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం తగదన్నారు. అయితే రైతులు సైతం హామీలు నమ్మి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు అడ్డుకుంటుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలు, ఇబ్బందులను ఎంపిపి అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి ఆయనతో ఏకరువు పెట్టారు.