తెలంగాణ

డ్రగ్స్ మాఫియా విచారణ పర్యవేక్షణకు సీనియర్ ఐపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: డ్రగ్స్ మాఫియా వ్యవహారాన్ని మొత్తం పర్యవేక్షించేందుకు అదనపు డిజి లేదా ఐజి స్ధాయి సీనియర్ ఐపిఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్‌పై పని భారం వత్తిడి పెరిగింది. పైగా ఈ కేసు వివిధ రాష్ట్రాలకు విస్తరించి ఉంది. ఇంతవరకు సినీరంగానికి చెందిన 12 మంది నోటీసులు ఇచ్చారు. వీరిలో చాలా మందిని విచారించారు. ఇంతవరకు ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరు, విచారణలో వెల్లడైన అంశాలపై అకుల్ సబర్వాల్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు. సబర్వాల్‌కు సహాయకుడిగా ఒక ఐపిఎస్ అధికారిని నియమించాలా లేక ఒక సీనియర్ ఐపిఎస్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలనే విషయమై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఈ విషయమై డిజిపి అనురాగ్ శర్మ అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ శాఖ ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది. ఇందులో కెల్విన్,జీషస్ అనే నిందితులు కీలకంగా మారారు. గతంలో డ్రగ్స్ మాఫియా కేసుల్లో దర్యాప్తు చేసిన అనుభవం ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎటువంటి వత్తిడికి గురికారాదని, దర్యాప్తులో ఎంత పెద్దవారైనా విచారించాలని, ఈ విషయమై వెనకాడ వద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్సైజ్ శాఖను ఆదేశించిన విషయం విదితమే. రాష్ట్ర సిఐడి శాఖ పరిధిలో మాదకద్రవ్యాల నిరోధక విభాగం ఉంది. ఆ విభాగం, ఎక్సైజ్ శాఖ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లతో పాటు వివిధ జిల్లా ఎస్పీ కార్యాలయాలు, ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలతో కలిసి డ్రగ్స్ మాపియాను అరికట్టేందుకు ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్ బుధవారం కలిసి దర్యాప్తు తీరును వివరించారు.
ఉక్కుపాదంమోపుతాం: మంత్రి పద్మారావు
డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, ఈ కేసులో సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ప్రకటించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. ఈ కేసుల్లో నిజంగా ప్రమేయంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టం తన పనితాను చేసుకుని పోతుందన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కళంకం తెచ్చే డ్రగ్ మాఫియాను తెలంగాణ నుంచి తరిమిగొడుతామన్నారు. ఈ నెల 30వ తేదీన కెబిఆర్ పార్కు వద్ద యాంటీ డ్రగ్ వాక్‌ను నిర్వహిస్తామన్నారు.