తెలంగాణ

ఎన్టీపీసీ 6వ యూనిట్‌లో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఏప్రిల్ 4: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ 6వ 500 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. 500మెగావాట్లకు చెందిన 6వ యూనిట్ టర్బైన్‌లో స్పల్పంగా మంటలు రావడాన్ని గమనించిన ప్రవీణ్ కుమార్ అధికారి మంటలు ఆర్పిందుకు అక్కడే ఉన్న ఫైర్ పైపును ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఆయన చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ అధికారిని ఎన్టీపీసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స జరిపి హైదరాబాద్‌కు తరలించారు.
వడదెబ్బకు మరో ఐదుగురు మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రచండ భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రాష్ట్రంలో మరో ఐదుగురు ఎండల తీవ్రతను తట్టుకోలేక తనువు చాలించారు. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన చెట్లపల్లి రాజయ్య (50) వంట చెరుకు కోసం వెళ్లి వస్తూ అస్వస్థతకు గురై సోమవారం మరణించాడు. వరంగల్ జిల్లా మంగపేట మండలం ఎక్కెల గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బలంతుల సరోజన (66) వడదెబ్బకు గురై మృతిచెందింది. అలాగే, కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం వడదెబ్బ తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సురారం గ్రామానికి చెందిన పిట్టల కిష్టయ్య(40) వ్యవసాయ కూలీ, అంబటిపెల్లి గ్రామానికి చెందిన మానేటి భానయ్య(50) తాత్కాలిక ఉద్యోగి వడదెబ్బతో మృతి చెందా రు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌కు చెందిన కరికే సంజీవ్ (50) కొద్ది రోజులుగా ఎండలో పనిచేస్తూ రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై తనువు చాలించాడు.
ఆగని కల్తీ దందా...
16 వందల లీటర్ల కల్తీనూనె, నెయ్యి, తేనె స్వాధీనం
6 క్వింటాళ్ల నకిలీ మసాలాలు, పాల పౌడర్ సీజ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 4: విశ్వనగరంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ నగరం అదే స్థాయిలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్, పోలీస్ టాస్క్ఫోర్స్ దాడులు జరుగుతున్నా వాప్యారులు ఏ మాత్రం జంకకుండా తమ కల్తీ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా బేగంబజార్‌లో నకిలీ పాల పౌడర్ తయారు చేస్తున్న కేంద్రం పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి సుమారు 300 క్వింటాళ్ల కల్తీపాలపొడిని స్వాధీనం చేసుకొని గోడౌన్‌ను సీజ్ చేశారు. నగర శివారులో గడచిన 3 నెలలుగా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో నకిలీ నూనె, నెయ్యి, తేనె, నకిలీ మసాలాలు, పాన్ మసాలాలు పట్టుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహాడిషరీఫ్‌లో పశువుల ఎముకలతో నూనె తయారు చేస్తున్న గోడౌన్‌పై దాడి చేసి 16 డ్రమ్ముల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా చెక్క పొడి, డాల్డ, వెన్నలతో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో పేరున్న బ్రాండ్లతో విక్రయిస్తున్న సుమారు ఆరు షాపుల్లో 800 లీటర్ల నెయ్యి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 18 కేసులు నమోదు చేసినట్టు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి, కీసర, ఎల్‌బి నగర్, టప్పా చబుత్రా, బేగంబజార్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లోని హోల్ సేల్ దుకాణాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ గరం మసాలాలు, పాన్ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు.