తెలంగాణ

పోకిరీల ఆట కట్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఈవ్ టీజ్‌కు పాల్పడే పోకిరీల ఆట కట్టిస్తామని, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జనవరి నుంచి మార్చి 31వరకు షీటీమ్స్ బృందం 138 కేసులు నమోదు చేసిందని షీటీమ్స్ అధికారిణి, అదనపు కమిషనర్ (క్రైమ్, సిట్) స్వాతిలక్రా తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, స్మార్ట్ ఫోన్ వాడుతూ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద మహిళలు, యువతులను వేధిస్తున్నారని ఆమె చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సెల్‌ఫోన్ల వినియోగం, ఆధునిక టెక్నాలజీ ఎంత పెరిగిందో..అంతే స్థాయిలో పోకిరీల ఆగడాలు పెరిగాయని, పోకిరీల ఆట కట్టించేందుకు జంట నగరాల కమిషనరేట్‌లో పరిధిలో దాదాపు 68 బృందాలు పనిచేస్తున్నాయన్నారు. సెల్‌ఫోన్లో అశ్లీల వీడియో దృశ్యాలు, మెసేజ్‌లు పంపించడం, ప్రేమ పేరుతో వంచించేందుకు యత్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిలపై నిఘా వేశామని వివరించారు. మూడు నెలల కాల వ్యవధిలో 138 ఫిర్యాదు అందాయని, వాటిలో రాత్రి వేళల్లో రిపీట్ కాల్ చేస్తూ యువతులను వేధించే 44 ఫిర్యాదులు, ప్రేమ సందేశాలు పంపించిన 24 కేసులు, పాత పరిచయాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న 24 కేసులు, వల్గర్‌గా మాట్లాడుతూ, రిపీట్ కాల్స్ చేసిన వారిపై 19 ఫిర్యాదులు అందాయని, 8మందిపై వాట్సాప్ ద్వారా అశ్లీల చిత్రాలు పంపించిన కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు. మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని, చట్టపరంగా వారిని శిక్షిస్తామని స్వాతిలక్రా హెచ్చరించారు.