తెలంగాణ

భూముల రీ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: రాష్టవ్య్రాప్తంగా త్వరలో భూముల రీ సర్వే చేపట్టనున్నట్టు భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టనున్న భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్లు మంజూరు చేసిందన్నారు. సెంటర్ ఫర్ ల్యాండ్ యూస్ మేనేజిమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరుగనున్న ‘జాతీయ భూ సర్వే విధానం- రికార్డుల ఆధునీకరణ’ సదస్సులో రేమండ్ పీటర్ మాట్లాడారు. భూముల రికార్డులను భద్రపర్చడానికి ఇప్పటికే హై రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేయబోతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా భూముల రీ సర్వేకు కేంద్రం నిధులిస్తుందని చెప్పారు. ఇప్పటికే ‘్భ భారతి’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా భూ సర్వే ప్రక్రియ పూరె్తైందని రేమండ్ పీటర్ తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా భూముల రీ సర్వే చేపట్టడానికి తమ శాఖలో సర్వేయర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది కొరత ఉండటంతో అన్ని జిల్లాల్లో కార్యక్రమాన్ని చేపట్టలేక పోయామని వివరించారు. ఖాళీగావున్న పోస్టులను భర్తీచేయగానే సర్వే పనులు ఊపందుకుంటాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివరాలు ఇప్పటికే రెవిన్యూ, సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలలో ఆన్‌లైన్లలో అందుబాటులో ఉన్నాయని, ఈ రికార్డులను శాశ్వతంగా భద్రపర్చడానికి డిజిటలైజ్ చేయబోతున్నామని చెప్పారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రికార్డులను ఏవిధంగా భద్రపర్చాలనే అంశంపై సిబ్బందికి మొదట శిక్షణ ఇస్తామని చెప్పారు.